మాజీమంత్రి కొల్లు రవీంద్ర
సిరా న్యూస్,మచిలీపట్నం;
మీచాంగ్ తుఫాన్ ప్రభావంతో కరగ్రహారం, క్యాంబిల్ పేట, చిన్నకరగ్రహారం, పల్లిపాలెం, నవీన్ మిట్టల్ కాలనీ, మేకవాని పాలెం,తాళ్లపాలెం, మంగినపూడి, తుమ్మలచెరువు,పేద యాదర, చిన యాదర, భోగిరెడ్డిపల్లి,నెలకుర్రు చిన్నాపురం, గ్రామాలలో నీట మునిగి దెబ్బతిన్న వరి, వేరుశనగ, మినువు పంటలు ప్రభుత్వం సరైన రీతిలో స్పందించకపోవడంతో మొత్తం పొలాలు నీళ్లతో నిండిపోయి, అమ్ముకోవడానికి వీలు కాకుండా కుళ్లిపోయి నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శించి తక్షణమే అధికారులు స్పందించి రైతాంగానికి ఇన్సూరెన్స్ కింద ఆదుకోవాలని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కోరారు.. వారితో పాటు మచిలీపట్నం నియోజకవర్గ రూరల్ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.