సిరా న్యూస్,రంపచోడవరం;
రంపచోడవరం మండలం ఫోక్స్ పేట చెక్పోస్ట్ వద్ద తాబేళ్లను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని, ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న ఫారెస్ట్ అధికారులు. మైదాన ప్రాంతమైన రామచంద్రపురం నుండి ఏజెన్సీ మీదుగా ఒడిశా ప్రాంతానికి అక్రమంగా తరలిస్తున్న తాబేళ్లను అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. ఫోక్స్ పేట అటవీశాఖ తనిఖీ కేంద్రం వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా తాబేళ్లు అక్రమ రవాణా చేస్తున్న వాహనాన్ని పట్టుకున్నట్లు రేంజ్ అధికారి కరుణాకర్ తెలిపారు. పట్టుబడ్డ వాహనంలో 30 బస్తాల్లో సుమారు 1000 వరకు తాబేళ్లు ఉన్నాయని చెప్పారు.
=====