సిరాన్యూస్, బోథ్
దొడ్డు వడ్లకు బోనస్ చెల్లించాలి
* బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన
* తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేత
రైతుల పండించిన పంటలకు బోనస్ చెల్లించి పూర్తి పంటను కొనుగోలు చేయాలని బోథ్ మండల బీఆర్ఎస్ నాయకులు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని ఖండిస్తూ గురువారం పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు స్థానిక శాసనసభ్యులు జాదవ్ అనిల్ ఆదేశాల మేరకు గురువారం స్థానిక తహసీల్దార్ సుభాష్ చంద్ర కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మండల పార్టీ కన్వీనర్ మాట్లాడుతూ చేతకాని హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజులు దాటిన ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్షులు బొడ్డు శ్రీనివాస్, మాజీ సర్పంచ్ సురేందర్ యాదవ్ ,సర్పంచ్ల సంఘం మాజీ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు అల్లగొండ ప్రశాంత్, ఉపాధ్యక్షులు సత్యనారాయణ , ఆత్మ మాజీ చైర్మన్ సుభాష్, డాక్టర్ స్వామి, మాజీ సర్పంచ్ సురేష్, ఉప సర్పంచ్ రమేష్, బి లింగారెడ్డి , వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.