సిరాన్యూస్, ఆదిలాబాద్
రైతులకు బోనస్ అందేంత వరకు పోరాడుతాం: మాజీ మంత్రి జోగు రామన్న
* వడ్లను నేలపై వేసి బీఆర్ఎస్ నాయకుల నిరసన
కాంగ్రెస్ మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన వాగ్దానాన్ని సీఎం రేవంత్ రెడ్డి విస్మరించి మోసం చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు.ఎన్నికలకు ముందు ప్రతీ సభలో రైతులు పండించిన వరి ధాన్యానికి 500 ల రూపాయల బోనస్ ఇస్తానని ఇప్పుడు సన్న వరి ధాన్యానికి మాత్రమే ప్రభుత్వం బొనస్ ఇస్తామని మాట మార్చడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని ఖండిస్తూ గురువారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ మేరకు జిల్లా పార్టీ కార్యాలయం నుండి బాబు జగ్జీవన్ రామ్ చౌక్ వద్ద రహదారిపై వడ్లను నేలపై వేసి నిరసన వ్యక్తం చేశారు.ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు, జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ గత బీఆర్ ఎస్ ప్రభుత్వం రైతులు గోసపడకుండా అలాగే రైతుల ఆత్మహత్యలను అరికట్టే విధంగా రైతాంగానికి ప్రత్యేక ప్రాధాన్యమిచ్చి రైతుబంధు తో పాటు సమయానికి ఎరువులు విత్తనాలు ను అందించి రైతులకు అండగా నిలిచిందన్నారు. అలాంటి రైతులను ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం నాన్న ఇబ్బందులకు గురి చేస్తుందని మండిపడ్డారు.ప్రస్తుత రాష్ట్రంలో 80 శాతం రైతులు దొడ్డు వడ్లను పండిస్తారని,20 శాతం పండిస్తున్న సన్న వడ్లకు 500 ల బోనస్ ఇస్తామని అనడం సరికాదని, అన్ని రకాల వడ్లకు బోనస్ చెల్లిస్తామని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మాటమార్చడం పట్ల మండి పడ్డారు .దొడ్డు వడ్లు పండించిన పంటలకు కూడా 500 లబోనస్ తో పాటు రైతులకు ఇస్తానన్న 15వేల రూపాయల ఇవ్వాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో బీఆర్ ఎస్ పార్టీ రైతుల పక్షాన ఉండి వారికి న్యాయం జరిగేంత వరకు పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు అజయ్, వీజ్జగిరి నారాయణ, రోకండ్ల రమేష్, సలీం, మారిశెట్టి గోవర్ధన్, గండ్రత్ రమేష్, లింగారెడ్డి, సాజితుద్దీన్, దాసరి రమేష్, పర్వీన్ సంద నర్సింగ్ . కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు