సిరాన్యూస్, ఆదిలాబాద్
కంది శ్రీనివాస్‌రెడ్డి పై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు
కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీనివాస్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని గురువారం కాంగ్రెస్ నాయకురాలు గండ్రత్ సుజాత, సంజీవ్ రెడ్డి అభిమానులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నాయకులు గండ్రత్ సుజాత, అల్లూరి సంజీవ్ రెడ్డిలు ఎంపీ ఎన్నికల్లో బీజేపీ దగ్గర డబ్బులు తీసుకున్నారని అసత్య ఆరోపణలు చేసిన కంది శ్రీనివాస్ రెడ్డి పై చట్ట రీత్యా తీసుకోవాలని ఆదిలాబాద్ పట్టణ 1టౌన్ పోలీస్ స్టేషన్ లో గండ్రత్ సుజాత, సంజీవ్ రెడ్డి అభిమానులు ఫిర్యాదు చేశారు.