సిరాన్యూస్, ఖానాపూర్
పార్టీ గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు: బాణావత్ గోవింద్ నాయక్
కాంగ్రెస్ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలందరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు బాణావత్ గోవింద్ నాయక్ తెలిపారు. గురువారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షులు బాణావత్ గోవింద నాయక్ మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా కాంగ్రెస్ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణక్క గెలుపు కోసం గత 2 రెండు నెలలుగా క్షేత్రస్థాయిలో కష్టపడినా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అనుబంధ సంఘ నాయకులకు, జిల్లా ప్రజా ప్రతినిధులకు, మండల అధ్యక్షులు మండల ప్రజా ప్రతినిధులకు, గ్రామ అధ్యక్షులకు గ్రామ ప్రజాప్రతినిధులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ మొత్తంలో దాదాపు 14 సీట్లు గెలిపించుకోవడం ఖాయమని, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని దీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వడం ఖాయమని అన్నారు.