సిరాన్యూస్, కడెం
10 లీటర్ల నాటు సారా పట్టివేత : ఎక్సైజ్ ఎస్సై అభిషేకర్
నిర్మల్ జిల్లా కడెం మండలం లో శుక్రవారం ఉదయం లింగాపూర్ గ్రామం నుంచి అక్రమంగా తరలిస్తున్న10 లీటర్ల నాటు సారాను ఎక్సైజ్ ఎస్సై, సిబ్బంది దాడి చేసి పట్టుకున్నారు. ఎక్సైజ్ ఎస్సై అభిషేకర్ తెలిపిన వివరాల ప్రకారం. కడెం మండలానికి చెందిన గుగ్లావత్ మోహన్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనం పై(10) లీటర్లు నాటుసారా అక్రమంగా తరలిస్తుండగా దాడి చేసి పట్టుకున్నామని తెలిపారు. అతని ఫై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వివిధ కేసులలో పట్టుబాట్ట ముగ్గురు వ్యక్తులను కడెం తహసీల్దార్ ముందు బైండోవర్ చేశామని తెలిపారు. ఈదాడిలో సిబ్బంది గౌతమ్, రవీందర్, భాస్కర్ పాల్గొన్నారు.