సిరా న్యూస్,నల్గోండ;
కృష్ణా జిల్లా ఇల్లా పామర్రుకు చెందిన ఆటో డ్రైవర్ కొల్లూరి రాజ వర్ధన్ నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఎర్రసానిగూడెంలో దారుణ హత్య కు గురయ్యాడు. మృతదేహం ఎర్రసానిగూడెం హైవే పక్కన చెట్లలో పడి ఉంది. కాళ్లు కట్టి.. నోట్లో గుడ్డలు కుక్కి హత్య..చేతి పై బలమైన ఆయుధంతో పొడిచినట్లు గుర్తులు వున్నాయి. డబ్బులు కోసమే హత్య జరిగి ఉండవచ్చు అని చపోలీసులు అనుమానిస్తున్నారు. కట్టంగూరు పోలీసులు హత్య కేసు కింద కేసు నమోదు చేసారు. మృతుడు శుక్రవారం రాత్రి మొవ్వ మండలం నిడుమోలు నుంచి టాటా ఏసీ లో సామాన్లు తీసుకుని హైదరాబాద్ బయలుదేరినట్లు సమాచారం.