నందిగామ డీవీఆర్ కాలనీ లో కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్

అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు
సిరా న్యూస్,నందిగామ;
నందిగామ పరిధిలో గల డివిఆర్ కాలనీలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించి, ఎటువంటి డాక్యుమెంట్స్ లేని వాహనాలను సీజ్ చేశారు. అనుమానితులను అదుపులో తీసుకొని ఐరిష్ టెస్ట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏసిపి రవి కిరణ్ మాట్లాడుతూ పట్టణ పోలీస్ స్టేషన్ లిమిట్స్ గల డివిఆర్ కాలనీలో ఈరోజు తెల్లవారుజామున కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించమని దాదాపు 500 ఇల్లు తనిఖీ చేసామని అదే విధంగా ఎటువంటి రికార్డు లేని 27 బైకులు 22 ఆటో స్వాధీనం చేసుకున్నామని అదే విధంగా ఐరిష్ మొబైల్ ద్వారా 72 మంది అనుమానితులను తనిఖీ చేశామని వారిలో ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని వారు పలు కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారని ఏసీపీ తెలిపారు.
రాబోయే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ తర్వాత కూడా ఎటువంటి అసాంఘిక సంఘటనలు జరగకుండా ఉండటానికి కూడా ముందస్తు జాగ్రత్తగా కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేశామని 144 సెక్షన్ అమలులో ఉన్నందున ప్రజలందరూ ఒకే చోట ఎక్కువగా ఉండకూడదు అదేవిధంగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఇరు పార్టీలు కవ్వింపు చర్యలకు పాల్పడకూడదు అని కోరుతున్నాను. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ తర్వాత కూడా ప్రశాంతంగా ఉండాలని దానిలో భాగంగానే ఈరోజు కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేశామని ఏసీపీ తెలిపారు. ఈ సెర్చ్ ఆపరేషన్ లో నందిగామ సీఐ హనీష్ ఎస్సైలు పండు దొర దుర్గా మహేశ్వరరావు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *