సిరా న్యూస్, బేల
రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం : కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఫైజుల్ల ఖాన్
రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయమని కాంగ్రెస్ బేల మండల అధ్యక్షుడు ఫైజుల్ల ఖాన్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో గల స్థానిక కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతిని మంగళవారం మండల కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈసందర్బంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నినాదాలతో హోరెత్తించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ భారతదేశానికి రాజీవ్ గాంధీ చేసిన సేవలు గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సంజయ్ గుండావార్, వామన్ వాన్ ఖేడే, రాందాస్ నాక్లే, సుధాం రెడ్డి, మోబిన్ ఖురేషి, అహ్మద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.