సిరా న్యూస్,హైదరాబాద్;
బ్లాక్ డ్రెస్, ముఖాలకు మాస్కులు ధరించి ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు 10 నిమి షాల వ్యవధిలోనే రెండు చోట్ల సెల్ఫోన్లు లాక్కొని పారిపో యారు. ఎస్ఆర్నగర్ పోలీసుల కథనం ప్రకారం.. బెంగళూరుకు చెందిన హోటల్ ఉద్యోగి పి. రాజు సోమవారం ఉదయం 5 గంట లకు బల్కంపేట రోడ్డులో నడుచుకుంటూ వెళ్తుండగా.. ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు అతడి చేతిలో ఉన్న సెల్ ఫోన్ లాక్కుని పారిపోయారు. మరో ఘటనలో.. అమీర్పేట వెల్ నెస్ దవాఖాన వద్ద ప్రైవేటు ఉద్యోగి సురేశ్ నడుచుకుంటూ వెళ్తుం డగా.. బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు అతడి చేతిలో ఉన్న సెల్ ఫోన్ లాక్కుని పారిపోయారు. దీంతో బాధితులు ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు
=========