చేతివృత్తుల వారు రాజ్యాధికారం సిరిసంపదలు కోల్పోయారు
జాతీయ బీసీ సంక్షేమ సంఘం స్టేట్ సెక్రటరీ వడ్డేపల్లి హనుమంతు
సిరా న్యూస్,హైదరాబాద్;
రాజ్యాధికారం రైతుల పేరుతో భూమి కలిగిన కులాల పరం అయ్యింది.
నిజమైన రైతులు రైతు కూలీలుగా, కౌలు రైతులుగా మిగిలిపోయారు. ఆకలి చావులకు గురౌతున్నారు, అప్పులతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతు ఆత్మహత్యలు అన్నీ కౌలు రైతుల ఆత్మహత్యలే.
మన చేతివృత్తులవారు ఐక్యమత్యం అవడం ద్వారా మాత్రమే తిరిగి మనం రాజ్యాధికారం సాధించగలం.
రాజ్యాధికారం ద్వారా మాత్రమే మనం కోల్పోయిన మన సిరిసంపదలు మన జాతులవారు తిరిగి సాధించి ఆర్ధిక స్వావలంబన సాధించగలరు.
రాజ్యాధికారంలో ఉన్న భూస్వామ్య వర్గాలు అమలు చేసే సంక్షేమ పథకాలు, విద్య మన జీవితాలను మార్చలేవు.