10 న విజయవాడలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల మహాసభ..
సిరా న్యూస్, గొల్లప్రోలు : ఆంధ్ర ప్రదేశ్ కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ప్రధమ సభ డిసెంబర్ 10న ఆదివారం విజయవాడ జింఖానా గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్నట్లు కాకినాడ జిల్లా అధ్యక్షులు శ్రీరంగ భాస్కర్, స్టేట్ మెంబర్ శ్యామ్, ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ కుమార్, జిల్లా కో చైర్మన్ నాగేశ్వరరావు జిల్లా కో చైర్మన్ చిన్నారి సురేష్, ట్రెజరర్ పద్మజ తెలిపారు. గొల్లప్రోలు పట్టణంలోని సురేష్ కల్యాణ మండపంలో నిర్వహించాన సమావేశంలో వారు మాట్లాడుతూ గొల్లప్రోలు, పిఠాపురం పరిధిలోని అన్ని ప్రభుత్వ శాఖలలో పని చేస్తున్న కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో డిసెంబర్ 10వ తేదీన మొట్ట మొదటి సారిగా నిర్వహించే సభను విజయవంతం చేయవలసినదిగా కోరారు. అనంతరం పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమములో గొల్లప్రోలు, పిఠాపురం మునిసిపల్ ఉద్యోగులు, హౌసింగ్ తదితర ప్రభుత్వ శాఖలో పనిచేసే ఆంధ్ర ప్రదేశ్ అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఉద్యోగులు పాల్గొన్నారు.