సిరా న్యూస్,ఓదెల
కొలనూర్‌లో కొవ్వొత్తులతో రాజీవ్ గాంధీకి నివాళి
ఓదెల పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూర్ రైల్వే గేట్ దగ్గర మంగళవారం రాత్రి మాజీ ప్రధాన మంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా మండల కాంగ్రెస్ నాయకులు కొవ్వొత్తులతో రాజీవ్ గాంధీకి నివాళులర్పించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు , మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుండేటి ఐలయ్య యాదవ్ మాట్లాడారు. సాంకేతిక టెక్నాలజీ విప్లవం ద్వారా భారత దేశాన్ని ఐటీ , టెలికాం , అంతరిక్ష పరిశోధన రంగాలలో ప్రపంచంలో అగ్రగామిగా నిలిచేందుకు పునాదులు వేసింది రాజీవ్ గాంధీ అని అన్నారు. కార్యక్రమంలో జంగం కొమురయ్య కందులసదాశివ్ , పల్లపు కొమురయ్య , మేకల సమ్మయ్య , గాజుల శివశంకర్ , బొంగానీ సదయగౌడ్ , బండారి చంద్రయ్య , కందుల అశోక్ పటేల్ , కుంచంమల్లయ్య , మాడిశెట్టి శంకరయ్య , దొడ్ల బాబురావు తదితరులు పాల్గొన్నారు.