చేతిలో కత్తితో నగ్నంగా వ్యక్తి సంచారం..భయాందోళనలో స్థానికులు

 సిరా న్యూస్,అవనిగడ్డ;
అవనిగడ్డ నియోజకవర్గం చల్లపల్లిలో మంగళవారం రాత్రి కోమలా నగర్ ఎస్టీ కాలనీకి చెందిన శివ అనే వ్యక్తి ఒళ్ళంతా రక్తంతో నగ్నంగా కత్తి పట్టుకొని రోడ్లపై తిరిగాడు. అతనిని చూసి గ్రామస్థులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. గుడారాల వద్ధ ఘర్షణలో గాయపడిన శివ తిన్నగా పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లి కూర్చున్నాడు. స్టేషన్ ఆవరణలో, బయట రోడ్డు మీద నగ్నంగా కూర్చుని రచ్చ చేశాడు. పోలీస్ సిబ్బంది వెంటనే ఈ సమాచారం అధికారులకు, అతని బంధువులకు అందించి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది..
======

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *