సిరా న్యూస్,జమ్మలమడుగు;
కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోని పెద్దముడియం మండలం నెమళ్లదిన్నె గ్రామం వద్ద కుందూ నదిలో తొమ్మిది నెమళ్లు విగత జీవులుగా పడి ఉన్నాయి. ఈ ఘటనలో పరిశీలించిన పోలీసులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అటవీ అధికారులు ప్రాంతాన్ని సందర్శించి ఈ పక్షులు విష ఆహారం లేదా పిడుగుపాటుకు మరణించి ఉంటాయని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. పూర్తి వివరాలు నెమళ్ల పంచనామా అనంతరం తెలుస్తుందని తెలిపారు.
========