– మంత్రి దనసరి అనసూయసీతక్క
సిరా న్యూస్,హైదరాబాద్;
రాష్ట్రంలోని అన్ని అంగన్వాడి కేంద్రాలలో మౌలిక సదుపాయాలను కల్పించి వాటిని మరింత బలోపేతం చేయాలని స్త్రీ మరియు శిశువు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు.తెలంగాణాలో ఉన్న అన్నిఅంగన్వాడి కేంద్రాలన్నీ ఒకే మోడల్ గా ఉండేలా డిజైన్ రూపొందించాలని సూచించారు. డా.బీ.ఆర్. అంబెడ్కర్ సచివాలయంలో స్త్రీ మరియు శిశువు సంక్షేమ శాఖఅధికారులతో మంత్రి సీతక్క శాఖాపరమైన సమీక్ష నిర్వహించారు ప్రతీ అంగన్వాడి కేంద్రాలలో సౌచలయాలు విధిగా ఉండాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. వృద్దులపట్ల ప్రత్యేక ద్రుష్టి సాధించాలని, వారి స్థితిగతులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలని అధికారులకు మంత్రి సీతక్క ఆదేశించారు. స్త్రీ మరియు శిశువు సంక్షేమ ట్రాన్స్ జెండర్ శాఖ లో వారం రోజుల పాటు అవగాహన సదస్సు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖసెక్రటరీ వాకాటి కరుణ, డైరెక్టర్ నిర్మల కాంతి వెస్లీ, , వికలాంగుల సంక్షేమ శాఖడైరెక్టర్ శైలజ తదితర అధికారులుపాల్గొన్నారు.