స్వయం సహాయక సంఘాలకు స్కూళ్ల బాధ్యత

సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ బాధ్యతను స్వయం సహాయక సంఘాలకు అప్పగించింది. పాఠశాల స్థాయిలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు వేయాలని అందులో ఇందు కోసం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక మౌలిక సదుపాయాలకు సంబంధించిన పనులను అమలు చేయడం, పర్యవేక్షించడం, బలోపేతం చేయడం వంటి పనులు చూసుకుంటాయి.
పాఠశాల నిర్వహణ, విద్యార్థులకు పాఠశాలల యూనిఫామ్‌లు, మధ్యాహ్న భోజనం వంటివి అందించడంతో పాటు అన్ని ప్రభుత్వ పారిశుద్ధ్య పనులను అమ్మ ఆదర్శ కమిటీలే తీసుకుంటాయి. బాలికల మరుగుదొడ్ల నిర్మాణం, తాగునీటి సౌకర్యాలు కల్పించడం, చిన్న, పెద్ద మరమ్మతు పనులను చేపట్టడం, ఇప్పటికే ఉన్న, పనిచేయని టాయిలెట్ల పునరుద్ధరణ, నిర్వహణ, తరగతి గదుల విద్యుద్దీకరణ, స్కూలు ఆవరణలో పరిశుభ్రతగా ఉండేలా చూడడం, విద్యుత్ బిల్లులను తగ్గించేందుకు సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు, స్కూలు భవనం మొత్తం నిర్వహణ, విద్యార్థులకు యూనిఫారాలు కుట్టించడం వంటి బాధ్యతలను కూడా ఈ కమిటీలకే అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించారు. అమ్మ ఆదర్శ పాటశాల కమిటీలు ప్రతి స్కూలు స్థాయిలో మహిళ స్వయం సహాయక బృందాల నుంచి ఎంపిక చేస్తారు. గ్రామ సంస్థ లేదా ఏరియా స్థాయి సమాఖ్య ప్రెసిడెంట్ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు స్కూలు హెడ్ మాస్టర్ మెంబర్ కన్వీనర్‌గా ఉంటారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా చేపట్టే అన్ని కార్యక్రమాలను సమన్వయం చేసుకుంటారు. ఇలా చేయడం వల్ల వారికి ప్రభుత్వం కొంత మొత్తం చెల్లిస్తుంది.అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా పాఠశాలలపై నిరంతర పర్యవేక్షణ ఉండడంతో పాటు మహిళలకు ఆర్థికంగా చేయూతను అందించినట్టు అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. స్కూళ్లలో మౌలిక సదుపాయాల ఏర్పాటుపై రేవంత్ రెడ్డి సీరియస్ గా ఉన్నారు. ఇతర రాష్ట్రాల్లోని సర్కారు బడుల్లో అమలు చేస్తున్న మౌలిక సదుపాయాలను పరిశీలించి రాష్ట్రంలో అమలు చేయాలని అధికారులను ఇప్పటికే ఆదేశించారు. అవసరం అయితే కార్పొరేట్ సంస్థల నంచి సీఎస్ఆర్ ఫండ్స్ కోసం ప్రయత్నం చేయాలని, సౌకర్యాల మెరుగుపరిచేందుకు ఎన్నారైల సహకారం తీసుకోవాలని అధికారులను ఇప్పటికే ఆదేశించారు.
===================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *