సిరాన్యూస్, ఆదిలాబాద్
రైతుల కోసం హెల్ప్‌లైన్
ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశాలనుసారం జిల్లా రైతుల కోసం వ్యవసాయ అధికారి కార్యాలయం లో హెల్ప్‌లైన్ నెంబర్ ఏర్పాటు చేసినట్లు జిల్లా వ్యవసాయ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా రైతులకు విత్తనాల కొనుగోళ్లలో ఏదైన సమస్యలు ఎదురైనా, విత్తనాల ఎంపికలో సలహాలు సూచనలు, ఎవరైనా నకిలీ విత్తనాల విక్రయిస్తే రైతులు హెల్ప్ లైన్ నెంబర్లు 8074812429, 9392779149 సంప్రదించాలని తెలిపారు.