సిరా న్యూస్,ఖమ్మం;
ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండల కేంద్రంలో సీతారామ ప్రాజెక్ట్ కాలువ పనులను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పరిశీలించారు. సీతారామ ప్రాజెక్ట్ కింద పొలాలను కోల్పోతున్న రైతులకు మార్కెట్ రేటు కు అనుగుణంగా నష్టపరిహారం ఇవ్వాలని రైతులు మంత్రి తుమ్మలకి వినతి పత్రం ఇచ్చారు. ఆశించిన నష్టపరిహారం ఇవ్వని ఎడల మా భూములను ఇవ్వమని రైతులు తేల్చి చెప్పారు.