Vishwamitra: నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ : మండల వ్యవసాయ అధికారి విశ్వమిత్ర

సిరా న్యూస్, బేల‌
నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ : మండల వ్యవసాయ అధికారి విశ్వమిత్ర
* విత్త‌న విక్ర‌య దుకాణాల్లో త‌నిఖీలు

నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ న‌మోదు చేస్తామ‌ని మండల ఇంచార్జ్ వ్యవసాయ అధికారి విశ్వమిత్ర అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండ‌ల కేంద్రంలో గురువారం మండల టాస్క్ ఫోర్స్ బృందం విత్తన విక్రయ దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. మండల కేంద్రంలోని పలు దుకాణాల్లో నిల్వలు,  స్టాక్ రిజిస్టార్ లను క్షుణ్ణంగా పరిశీలించారు.ఈ సందర్బంగా మండల ఇన్‌చార్జి వ్యవసాయ అధికారి విశ్వమిత్ర మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండల టాస్క్ ఫోర్స్ టీమ్ తనిఖీలు చేపట్టడం జరిగింది అని అన్నారు.రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫర్టిలైజర్‌ యజమానులు గుర్తింపు పొందిన కంపెనీల విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను మాత్రమే అమ్మకాలు చేపట్టాలని సూచించారు. కొనుగోలు దారులకు తప్పని సరిగా దుకాణం రశీదును ఇవ్వాలన్నారు. రైతులు కావాలనుకునే విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను మాత్రమే ఇవ్వాలన్నారు. బలవంతంగా అమ్మకాలు చేపట్టకూడదని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల తహసీల్దార్ సవాయి సింగ్,ఎస్ఐ రాధికా , ఏఈఓలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *