సిరా న్యూస్,పెద్దపల్లి;
వైన్స్ షాప్ లో దొంగలు పడి లక్ష డెబ్బై వేల రూపాయలు ఎత్తుకెళ్లిన సంఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. పెద్దపెల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలోని మల్లికార్జున వైన్ షాపులో రాత్రి ఓ దొంగ వైన్ షాప్ వెనుక వైపున ఉన్నా తలుపులు పగలగొట్టి వైన్ షాపులోకి ప్రవేశించి కౌంటర్ లో ఉన్న 1,70,000 రూపాయల నగదును దొంగ ఎత్తుకెళ్లినట్టు వైన్ షాప్ యజమాని తెలిపారు .ఈ తతంగమంతా అక్కడ ఉన్న సీసీ కెమెరాలలో రికార్డు అయింది. ఉదయాన్నే 10 గంటలకు యజమాని షాపు ఓపెన్ చేసేసరికి వస్తువులన్నీ చిందర వందరగా ఉండడంతో చోరీ జరిగిందని గమనించిన యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయగా వెంటనే పోలీసులు సంఘటన స్థలాన్ని, సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించి యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సంఘటన స్థలాన్ని పెద్దపెల్లి ఏసిపి కృష్ణ పరిశీలించి త్వరలోనే దొంగను పట్టుకుంటామని వారు తెలిపారు.