రాష్ట్రస్థాయి ఫుట్ బాల్ పోటీలకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కనగర్తి విద్యార్థిని ఎంపిక.

సిరా న్యూస్ కోనరావుపేట:

రాష్ట్రస్థాయి ఫుట్ బాల్ పోటీలకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కనగర్తి విద్యార్థిని ఎంపిక.

ఇటీవల జరిగిన జిల్లాస్థాయి అండర్ 17 ఫుట్ బాల్ పోటీలలో ప్రతిభ కనబరిచిన రాజన్న సిరిసిల్ల జిల్లా కనగర్తి ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని మాదం శ్రీ తేజ రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపికైనట్లు జిల్లా పాఠశాల క్రీడల కార్యదర్శి శ్రీ దేవత ప్రభాకర్ ప్రకటించారు. ఈ పోటీలు 8 తేదీ నుండి 10 వరకు  మహబూబ్ నగర్ జిల్లాలో జరుగనున్నాయి. అందులో పాల్గొననున్న విద్యార్థిని మాదం శ్రీ తేజ ను గ్రామ సర్పంచ్ అనుపాటి భారతి , ఎస్ఎంసి చైర్మన్ మంచ భూమయ్య , గ్రామస్తులందరూ అలాగే పాఠశాల ప్రధానోపాధ్యాయులు. ఎమ్ . వినోద్ కుమార్ ఉపాధ్యాయ బృందం, పి ఈ టి అజయ్ కుమార్ అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *