సిరాన్యూస్, కుందుర్పి
బాధితుడికి రూ.30వేలు ఆర్థిక సాయం : ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్
శెట్టూరు మండల కేంద్రానికి చెందిన మూర్తి (38) వెన్నెముక సమస్యతో బాధ పడుతున్నాడు. గురువారం చికిత్స కోసం అనంతపురం లోని ప్రముఖ ఆసుపత్రికి వెళ్లగా డాక్టర్లు వెంటనే ఆపరేషన్ చేయాలని సూచించారు. ఆపరేషన్ 1,50,000/- అవుతుందని వైద్యులు తెలిపారు. ఈ విషయం విన్న బాధితులు డబ్బులు లేక వెనుతిరిగి వచ్చేశారు.ఆపరేషన్ చేయకపోతే పెరాలసిస్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు సూచించడం తో దిక్కుతోచని స్థితిలో ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్సభ్యులను స్నేహితుల ద్వారా సంప్రదించారు. వెంటనే స్పదించిన ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్ట్రస్ట్ తరపున రూ.30,000 చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ వైస్ ఛైర్మెన్ సురేష్, ట్రస్ట్ కోశాధికారి అబ్దుల్ వాహబ్, సభ్యులు లోకేష్ పాల్గొన్నారు.