సిరాన్యూస్, చిగురుమామిడి
గ్రామ పంచాయతీ ఆస్తుల తనిఖీ చేసిన డీపీఓ రవీందర్
కరీంనగర్ జిల్లా చిగురుమామిడిలోని గ్రామ పంచాయతీ ఆస్తులను శుక్రవారం అధికారులు తనిఖీలు చేశారు. జిల్లా పంచాయతీ అధికారి వి రవీందర్ చిగురుమామిడి గ్రామపంచాయతీని, డివిజనల్ పంచాయతీ అధికారి రాంబాబు కొండాపూర్, ఇందుర్తి గ్రామాలను సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలోని నర్సరీ, పల్లె ప్రకృతి వనము, సగ్రిగేషన్ షెడ్, తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం,వైకుంఠధామము, నిర్వహణ, పారిశుద్ధ్య నిర్వహణపై తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆస్తుల నిర్వహణ ఇలాగే కొనసాగిస్తూ వాటిని సక్రమ పద్ధతిలో పరిరక్షించాలని, రాబోవు తరాలకి వాటి ఉనికిని తెలియజేసే విధంగా సంరక్షించాలని కోరారు. చిగురు మామిడి తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణ ఆవరణలో విద్యుత్తు దీపాల ఏర్పాటు, ప్రాంగణం చుట్టూ బయో ఫెన్సింగ్ చేయించాలని పంచాయతీ కార్యదర్శిని డిపిఓ ఆదేశించారు. వీరి వెంట మండల పంచాయతీ అధికారి శ్రావణ్ కుమార్, సంబంధిత గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.