సిరాన్యూస్, ఖానాపూర్
పెద్దమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలోని సత్తాన్ పల్లి గ్రామంలో శుక్రవారం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి 4వ వార్షకోత్సవం, బోనాల జాతర మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈసందర్బంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం , మండల అధ్యక్షులు దొనికేని దయానంద్ ,పట్టణ అధ్యక్షులు నిమ్మల రమేష్ ,నాయకులు తోట సత్యం,పుప్పాల శంకర్, సత్తనపల్లి గ్రామ నాయకులు గుమ్ముల రమేష్, బేర మల్లేష్, బిర్ణంది రాజన్న, గుమ్ముల రాజేందర్, మాలవత్ రమేష్, ముదిరాజ్ సంఘం సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.