– నటుడు శ్రీకాంత్
సిరా న్యూస్,హైదరాబాద్;
నిత్యం తీసుకునే ఆహారంలో వ్యాయామం చేస్తున్నవారు, ప్రొఫెషనల్స్ మాత్రమే కాకుండా ప్రతీ ఒక్కరు ప్రొటీన్ ఫుడ్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సినీ నటుడు, హీరో శ్రీకాంత్ అన్నారు. ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో ఫిట్నెస్ రివైవల్ అధినేత, సెలబ్రిటీ ఫిట్నెస్ ట్రైనర్ వెంకట్, ప్రముఖ వైద్యుడు అమర్నాథ్ సంయుక్తంగా రూపొందించిన జాయింట్ న్యూట్రిషియన్ ఉత్పతుల ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో ఫిట్‌గా ఉండటానికి ప్రతీ ఒక్కరు ప్రయత్నిస్తున్నారని ఆ ప్రయాణంలో మంచి ప్రొటీన్ ఉన్న ఫుడ్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ప్రొటీన్ ఫుడ్ తీసుకోవాలని అన్నారు.
మార్కెట్లో ఎన్నో ప్రొటీన్లు ఉంటాయని కానీ మేం తయారు చేసిన ప్రొటీన్ ఫుడ్‌లో ఆయుర్వేద పదార్థాలు వినియోగించామని, అశ్వగంధ, అర్జునతో పాటు పలు కీలక పదార్థాలు వినియోగించినట్లు ఫిట్నెస్ రివైవల్ అధినేత వెంకట్ అన్నారు. డాక్టర్ అమర్నాథ్ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు తీసుకునే ఆహారంలో 50 నుంచి 60 గ్రాముల ప్రొటీన్ అవసరం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ హెబ్బాపటేల్, ప్రముఖ నిర్మాత ఏఎంరత్నం, నటులు బాలాదిత్య, శ్రవణ్, మధు, తదితరులు పాల్గొన్నారు.