సిరా న్యూస్,హైదరాబాద్;
రహమత్ నగర్ లోని హై టెన్షన్ వైర్ కు షార్ట్ సర్క్యూట్తో మరో బాలిక విషమం గాయపడింది. విద్యుత్ ఘాతం తో బాలిక ఆసుపత్రి లో ప్రాణాలతో పోరాటం చేస్తోంది. షార్ట్ సర్క్యూట్తో సహశ్రీ (7) ఏళ్ల బాలిక తీవ్ర గాయాలు పాలయింది. మెహబూబాబాద్ నుండి బాలిక అమ్మమ్మ వేసవి విడిది కోసం రహమత్ నగర్ లోని ఎన్ ఎస్ బి నగర్ కు తీసుకువచ్చింది. మేడపై బాలిక ఆడుకుంటుండగా హై టెన్షన్ (11 కే వి ) వైర్లు తాకడంతో విద్యుత్ ఘాతానికి గురై 90% బాలిక శరీరం కాలిపోయింది. బంధువులు చికిత్స నిమిత్తం హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు. బాలిక ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు బంధువులు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
============