సిరాన్యూస్, ఖానాపూర్
ఆదివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం: ఏఈ యశ్వంతరావు
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో వివిధ గ్రామాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ ఏ ఈ యశ్వంతరావు తెలిపారు. ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఖానాపూర్, సోమవార్ పేట్, సత్తెనపల్లి, సుర్జాపూర్ గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని పేర్కొన్నారు. లైన్లో మరమ్మతులు, చెట్ల కొమ్మలు నరికివేత, మెయింటెనెన్స్ పనులు వల్ల అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు.ఈ అంతరాయానికి వినియోగదారులు సహకరించాలని కోరారు.