CI Sainath: న‌కిలీ విత్త‌నాలు విక్ర‌యిస్తే చ‌ర్య‌లు:  సీఐ సాయినాథ్

సిరాన్యూస్‌, బేల
న‌కిలీ విత్త‌నాలు విక్ర‌యిస్తే చ‌ర్య‌లు:  సీఐ సాయినాథ్

రైతుల‌కు న‌కిలీ విత్త‌నాలు విక్ర‌యిస్తే చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని సీఐ సాయినాథ్ అన్నారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో మండల టాక్స్ పోర్స్ ఆధ్వర్యంలో పలు విత్తన దుకాణాలలో తనిఖీ చేశారు.ఈ సందర్భంగా పలు విత్తనాల స్టాక్ ను, స్టాక్ రిపోర్ట్ ను పరిశీలించారు. విత్తనాలు బిల్లు చేసే టప్పుడు రైతుల పేరు, ఊరు తో పాటు రైతు సంతకం తప్పని సరి తీసుకోవాలని తెలిపారు. స్టాక్ రిపోర్ట్ రోజు వారీగా అధికారులకు తెలియజేయా లన్నారు. అనంత‌రం పలువురు డీలర్లకు నోటీసులు అందించారు. మండలానికి సంబందించిన విత్తన డీలర్స్ లు ఇక్కడి రైతులకు మాత్రమే విత్తనాలను అందించాలని,పక్క రాష్ట్రాలకు గానీ,పక్క మండలాలకు గాని విత్తనాలను ఇవ్వరాద‌ని తెలిపారు.ఈ కార్యక్రమంలో అధికారులు బేలా ఎస్ఐ రాధికా, వ్యవసాయ మండల విస్తారణ అధికారి విశ్వామిత్ర ,ఉమార్, నగేష్,సాయి,జావేద్ తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *