సిరా న్యూస్,బోథ్
సొనాలలో ఘనంగా రమాబాయి వర్ధంతి
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సతీమణి రమాబాయి వర్ధంతిని సోమవారం రమాబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈసందర్బంగా ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని సొనాలలో రమాబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాబాయి మహిళా మండలి అధ్యక్షురాలు పాటీల్ తిరుమల మాట్లాడారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎదుగుదలలో ఆమె చేసిన కృషి ఫలితమే ఈనాడు మనందరం ఈ పరిస్థితుల్లో ఉన్నామని తెలిపారు. కార్యక్రమంలో పాటీల్ మమతజనాభాయి, రుక్మ భగత్ కిరణ్ బుద్ధిష్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా మండల అధ్యక్షులు అమృత రావ్ పాటిల్ ప్రధాన కార్యదర్శి మునేశ్వర్ సోమన్న, బూర్తుల స్వామి, పాల్గొన్నారు