సిరాన్యూస్, చిగురుమామిడి
నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు: ఏవో రంజిత్ కుమార్
నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఏవో రంజిత్ కుమార్, ఎస్సై బండి రాజేష్ తెలిపారు. మంగళవారం చిగురుమామిడి మండల కేంద్రంలోని రైతు వేదికలో విత్తన డీలర్లతో సమావేశం నిర్వహించారు. వారికి పనులు సూచనలు చేశారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ రైతులు విత్తనాలు కొనుగోలు చేసినప్పుడు బిల్ రసీదు ఇవ్వాలన్నారు. నకిలీ విత్తనాలు గడువు ముగిసిన విత్తనాలు లూజు విత్తనాలు అమ్మినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులను నష్టపరిచే ఏ చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్నారు.