సిరాన్యూస్, ఆదిలాబాద్
రైతులను ఇబ్బంది పెట్టవద్దు : మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్
* కలెక్టరేట్ ఎదుట బీఆర్ఎస్ నాయకుల నిరసన
* జాయింట్ కలెక్టర్ శ్యామల దేవికి వినతి
రైతులకు అవసరమైన పత్తి విత్తనాలను అందుబాటులో ఉంచడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని మున్సిపల్ చైర్మన్ జోగుప్రేమేందర్ అన్నారు. విత్తనాల కోసం రైతులు పడుతున్న నేపథ్యంలో బుధవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి నిరసన చేపట్టారు. అనంతరం జాయింట్ కలెక్టర్ శ్యామల దేవికి వినతిపత్రం సమర్పించారు. ఈసందర్బంగా మున్సిపల్ చైర్మన్ జోగుప్రేమేందర్ రైతులను ఎటువంటి ఇబ్బందికి గురి చేయకుండా అవసరమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలని కోరారు. అనంతరం నాయకులు రోకండ్ల రమేష్ మాట్లాడుతూ గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రైతుల సంక్షేమమే పరమావధిగా ప్రభుత్వం పని చేసిందన్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో అన్నదాతలకు అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. విత్తనాల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారని, వారికి అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమయిందని ఆరోపించారు. రైతులకు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచి, ఎటువంటి ఇబ్బంది లేకుండా విత్తనాలను అందించని పక్షంలో బీఆర్ ఎస్ తరపున పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఐదు నెలల్లోనే ప్రజలు నీటి కష్టాలు , కరెంట్ కష్టాలు, రైతులు ఎనలేని ఇబ్బందులను ఎదురుచూడాల్సి వస్తుంది అన్నారు. అన్నదాతలకు బీఆర్ఎస్ ఎల్లవేళలా అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గండ్రత్ రమేష్, నాయకులూ రోకండ్ల రమేష్, మెట్టు ప్రహ్లాద్, ఇజ్జగిరి నారాయణ,లింగ రెడ్డి, పట్టణ అధ్యక్షులు అజేయ్.ధమ్మపాల్, ఆడప తిరుపతి, పండ్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు.