మళ్లీ ఎండలు

సిరా న్యూస్,విజయవాడ;

అకాల వర్షాల తర్వాత.. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఎండలు మండిపోతున్నాయి. ఏపీ, తెలంగాణలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. చాలా జిల్లాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో పగటిపూట బయట తిరగాలంటే భయపడుతున్నారు. ఒకవైపు ఎండ, మరోవైపు వడగాల్పులతో ఏపీలో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇవాళ్టి నుంచి వచ్చే మూడు రోజులు ఆంధ్రప్రదేశ్‌ లో ఎండల ప్రభావం ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది వాతావరణశాఖ. ఇవాళ 149 మండలాల్లో తీవ్ర వడగాలులు, 160 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రేపు 195 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 147మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. తిరుపతి జిల్లాలోని సత్యవేడులో 41.9 డిగీల్ర ఉష్ణోగ్రత, నెల్లూరు జిల్లా మనుబోలులో 41.5 డిగ్రీలు, బాపట్ల జిల్లా వేమూరు, కృష్ణా జిల్లా పెడనలో 40.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని తెలిపింది వాతావరణ శాఖ. వృద్ధులు, గర్భిణులు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు. అత్యవసరమైతేనే బయటకు రావాలని చెబుతున్నారు. జూన్ ఫస్ట్ వీక్ వరకు ఇదే పరిస్థితి ఉంటుందని.. సాధారణం కంటే మూడు, నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతాయన్నారు వాతావరణ అధికారులు. జూన్ రెండో వారం నుంచి నైరుతి రుతుపవనాల రాకతో.. ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *