సిరాన్యూస్ , ఆదిలాబాద్
నలుగురు దోపిడీ దొంగల అరెస్ట్: ఎస్పీ గౌష్ ఆలం
* జల్సాలకు అలవాటు పడి దోపిడీలు
* ప్రధాన నిందితులపై ఇదివరకే దాదాపు 20 కేసులు
* ఒక కారు, ఆటో, సెల్ ఫోన్, రూ 4000/- నగదు స్వాధీనం
* కేసును చేధించిన పోలీసు సిబ్బందికి అభినందనలు తెలిపిన ఎస్పీ
ఆదిలాబాద్‌లో నలుగురు దోపిడీ దొంగలను అరెస్ట్ చేసినట్లు ఆదిలాబాద్ ఎస్పీ గౌష్ ఆలం తెలిపారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. దోపిడీ దొంగలను ఆదిలాబాద్ జిల్లాలో అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. ఆదిలాబాద్‌లోని వడ్డెర కాలనీ కి చెందిన మీర్జ ముషరఫ్ బేగ్ (19) ఆలియాస్ ముషరఫ్ , ఆలియాస్ చోట ముషరఫ్ ఆలియాస్ ముస్సును ఏ1 కేసు నమోదు చేశారు. ఏ2 గా ఆదిలాబాద్‌లోని వడ్డెర కాలనీ కి చెందిన షేక్ బిలాల్(21) ఆలియాస్ షేక్ బిలాల్ అహ్మద్, ఏ3గా గజ్బే అక్షయ్ (25), ఏ4గా జైనథ్ మండలానికి చెందిన మేస్రం దత్తు (25) కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఈ నిందితులు ఇదివరకే నేరాలు చేస్తూ వచ్చిన డబ్బుతో జల్సాలు చేయడం, గంజాయి, మందు లాంటి మాదకద్రవ్యాలను సేవించడం అలవాటుగా చేసుకుని డబ్బుల కోసం హత్యలు, దోపిడీలు, ద్విచక్ర వాహనాల దొంగతనాలు, ఇళ్ల దొంగతనాలు లాంటి పలు రకాల నేరాలకు పాల్పడుతున్నారని తెలియజేశారు. ఈనెల 25న ఆదిలాబాద్ పట్టణంలో సినీ ఫక్కి తరహాలో ఒక అమాయకుని వద్ద డబ్బులు ఉన్నాయని గ్రహించి అతని ఎలాగైనా దోచుకుందామని ఉద్దేశంతో నిందితుడు మేస్రం దత్తు ఆటో డ్రైవర్ సహాయంతో నిందితులు మీర్జ ముషరఫ్ బేగ్ , షేక్ బిలాల్లు బాధితున్ని నడిరోడ్డుపై మా డబ్బులే దొంగలించావ్ అంటూ చిత్రీకరిస్తూ, గజ్బే అక్షయ్ సహాయంతో బాధితున్ని బలవంతంగా ఆటోలో కూర్చోబెట్టి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తున్నామంటూ నటించారు. చుట్టుపక్కల ప్రజలు అనుమానం రాకుండా ముందస్తు జాగ్రత్త పడుతూ, బాధితుడు రాకపోయేసరికి బలవంతంగా కొట్టి, పిడి గుద్దులు కురిపించి అతని వద్ద గల పదివేల రూపాయలను బలవంతంగా గుర్తు తెలియని వ్యక్తులు లాక్కొని పోయారని ఫిర్యాదు చేశారు. పోలలీసు దర్యాప్తు లో ఈ నలుగురు నేరస్తులను సీసీటీవీ కెమెరాల ఆధారంగా గుర్తించారని తెలిపారు . అదేవిధంగా ఈనెల 13 వ తారీఖున కూడా ఇదే తరహాలో రైల్వే స్టేషన్ రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిపై ఒక కారులో వచ్చి అతని నోరు నొక్కి బలవంతంగా కారులో ఎక్కించుకొని, బాధితుని చితకబాది అతని వద్ద నుండి ఒక సెల్ ఫోన్ డబ్బును కాజేసి బాధితున్ని మహారాష్ట్ర కు తీసుకు వెళ్ళగా మార్గమధ్యంలో ఉండం గ్రామ శివారులో మూత్ర విసర్జనకు ఆపినప్పుడు బాధితుడు చీకట్లో తప్పించుకున్నాడని విషయం ఇప్పుడే వెలుగులోకి వచ్చిందని, కేసు నమోదు చేయడం జరిగింది అని తెలిపారు. గతంలో నిందితులు ఏ1 , ఏ2లు తాంసి మండలం వడ్డాది ప్రాజెక్టులో డబ్బుల కోసం ఒక మైనర్ బలున్ని బైక్ పై మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేసి బాధితుని కాళ్లు చేతులు కట్టేసి ప్రాజెక్టు లో పాడేసి హత్యకు పాల్పడడం జరిగిందని తెలిపారు. ఈ క్రమంలో అతని వద్ద గల ద్విచక్ర వాహనాన్ని అమ్మి వచ్చిన డబ్బుతో జల్సాలు చేసుకోవడం జరిగింది అని తెలియజేశారు. నిందితులు ఏ1 పై,ఏ2 పై తెలంగాణా రాష్ట్రం లో దాదాపు 20 కేసులు నమోదు అయినట్లు తెలిపారు. నిందితులు దోపిడీ చేస్తూ అమాయక ప్రజలను మోసం చేస్తూ బాధితుల్ని కొట్టి బలవంతంగా డబ్బులు లాక్కుంటున్నట్లు తెలియజేశారు. వీరి వద్ద నుండి ఒక షిఫ్ట్ డిజైర్ కారు, ఒక ఆటో, ఒక సెల్ ఫోన్, రూ 4000/- నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ నలుగురిపై ఆదిలాబాద్ రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 194/2024, యూఎస్ 394,365 ఆర్/డబ్లూ 511ఐపీసీ 198/2024 394,365ఆర్/డబ్లూ. 34 ఐపీసీ కింద కేసులు నమోదు చేయబడ్డట్లు తెలిపారు. ఈ కేసులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఆదిలాబాద్ డిఎస్పి, రెండవ పట్టణ సిఐ, ఐటీ కోర్ సిబ్బంది సంజీవ్ కుమార్, ఎం ఎ రియాస్, క్రైమ్ పార్టీ సిబ్బంది రమేష్, నరేష్, క్రాంతి, నరేందర్, సుధాకర్ రెడ్డి లను జిల్లా ఎస్పీ అభినందించారు.

