ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన పోలింగ్
పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివచ్చిన ఓటర్లు
నువ్వా నేనా అనే విధంగా అభ్యర్థులు.
గెలుపు పై ఎవరి ధీమా వారిది
ఎవరు గెలిచినా 4 – 5 వేలు మించి మెజార్టీ రాదు ?
సిరా న్యూస్,బద్వేలు;
ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన బద్వేలు అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారు అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. గెలుపుపై ఎవరి ధీమా వారికి ఉంది ఎవరు గెలిచిన 4 – 5 వేలు మించి మెజార్టీ ఉండదు. అంతా ప్రతిష్టాత్మకంగా బద్వేలు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి ఈనెల 13వ తేదీ జరిగిన పోలింగ్‌లో పోలింగ్ కేంద్రాలకు భారీగా ఓటర్లు రావడం జరిగింది ఓటింగ్ టైమింగ్ ముగిసిన కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రెండు గంటల పైగా పోలింగ్ నిర్వహించారంటే ఏ స్థాయిలో ఓటర్లు వచ్చారు అనే విషయం తెలుస్తుంది ఇది దేనికి సంకేతం. బద్వేల్ అసెంబ్లీలో కూటమి అభ్యర్థిగా బొజ్జ రోశయ్య వైకాపా అభ్యర్థిగా డాక్టర్ సుధా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయ జ్యోతి పోటీ చేశారు ఇంకా కొంతమంది రంగంలో ఉన్నప్పటికీ వారు నామ మాత్రమే అని చెప్పాలి ఇది ఇలా ఉంటే బ్యాలెట్ ఓటింగ్‌లో భారీ సంఖ్యలో ఓట్లు వినియోగించుకున్నారు ఇది కూడా దేనికి సంకేతం. బద్వేలు అసెంబ్లీలో 78.73 శాతం పోలింగ్ జరిగింది ఎన్నికలను కూటమి పార్టీలు వైకాపా కాంగ్రెస్ పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మంగా తీసుకొని నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో ప్రచారం చేసాయి ప్రధానంగా తెలుగుదేశం పార్టీ దాదాపు సంవత్సర కాలంగా ప్రచారం చేస్తూ వచ్చింది ముఖ్యంగా బద్వేలు మాజీ ఎమ్మెల్యే విజయమ్మతో:పాటు ఆమె కుమారుడు తెలుగుదేశం పార్టీ యువ నేత రితేష్ రెడ్డి నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో 310 కిలోమీటర్లు పైగా పాదయాత్ర చేశారు పాదయాత్రకు ప్రజల నుండి ఊహించని విధంగా స్పందన వచ్చింది దీనికి కారణం కూడా లేకపోలేదు బద్వేలు అసెంబ్లీ రిజర్వు అయిన తరువాత ఇప్పటివరకు జరిగిన 4 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించలేదు ఇప్పుడు జరిగింది ఐదవ ఎన్నిక. కూటమి అభ్యర్థి బొజ్జ రోశయ్య ఎన్నికల ముందు వరకు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు ఆయనే పార్టీ ఇన్చార్జిగా నియమించారు కానీ ఊహించని విధంగా బద్వేల్ అసెంబ్లీ బిజెపికి కేటాయించడంతో రోశయ్య బిజెపిలో చేరి బిజెపి అభ్యర్థిగా రావడం జరిగింది తరువాత తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీలు రోశయ్య విజయం కోసం ఎంతో కష్టపడ్డాయి మాజీ ఎమ్మెల్యే విజయమ్మ పార్టీ యువ నేత రితేష్ రెడ్డి మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు ఏడు మండలాల్లో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు చేశారు. వైకాపా కూడా భారీ స్థాయిలో ప్రచారాలు చేసింది ఆ పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్యే వైకాపా ఎమ్మెల్సీ గోవిందరెడ్డి ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి స్థాయిలో ప్రచారం చేశారు ఇక కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగింది పార్టీ అభ్యర్థి విజయజ్యోతి కి మద్దతుగా కడప కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి
పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలారెడ్డి బద్వేలు నియోజకవర్గంలో రెండుసార్లు ప్రచారం చేశారు అలాగే దివంగత మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీత కూడా ప్రచారం చేశారు మండు ఎండలో చేసిన వీరి ప్రచారాలు బాగానే జరిగాయి ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రచారాల సమయం వరకు మూడు పార్టీలు ఊహించని స్థాయిలో ప్రచారాలు చేసి ప్రజలను ఆకట్టుకున్నాయి పోలింగ్ సమయంలో ఎక్కడ ఎలాంటి ఘర్షణలు దొంగ ఓట్లు నమోదు కాలేదు ఎన్నికల అధికారులు పోలీసులు పోలింగ్‌ను ఎంతో పకడ్బందీగా నిర్వహించారు ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు బారులు తీరారు ఇది కూడా దేనికి సంకేతము అనే విషయం తెలియడం లేదు
పోలింగ్ ముగిసి ఏడు రోజులు గడచిన ఇప్పటివరకు ఏ పార్టీ కూడా తాము గెలవబోతున్నామని చెప్పకపోవడం విశేషం
===========================xxx