సిరా న్యూస్, ఖానాపూర్
ఇంటి పన్ను చెల్లించాలి: మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో ప్రజలు ప్రతి ఒక్కరూ ఇంటి పన్ను సకాలంలో చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం అన్నారు. శుక్రవారం ఖానాపూర్ పట్టణంలో ఇంటింటికీ తిరుగుతూ ఇంటి పన్నును చెల్లించాలని కోరారు. ఈసందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఇంటి పన్ను బకాయిలను చెల్లించాలని, మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని అన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ కావలి సంతోష్ , మున్సిపాలిటీ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.