సిరా న్యూస్, ఖానాపూర్
తాగునీటి సమస్యను పరిష్కరించిన మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో ఇంద్రనగర్, గంగపుత్ర కాలనీల్లో తాగునీటి సమస్య ఏర్పడింది. ఈవిషయాన్ని స్థానిక కౌన్సిలర్ పరిమి లత- సురేష్ శుక్రవారం ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ కార్యాలయం నుండి నూతన బోరు మోటార్ తెప్పించారు. బోరుకు మరమ్మతులు చేయించి కాలనీవాసులకు తాగునీటిని అందించారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, మున్సిపాలిటీ వాటర్ సప్లై సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.