సిరాన్యూస్, ఖానాపూర్
డంపింగ్ యార్డ్ ను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటి డంపింగ్ యార్డ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ మిషన్స్ ను శుక్రవారం ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగంగా ప్లాస్టిక్ వేస్టేజ్ మిషన్స్ ను ఏర్పాటు చేయించామని తెలిపారు. వాటి ద్వారా ప్లాస్టిక్ డబ్బాలు, ప్లాస్టిక్ కవర్లను, వేరు చేయవచ్చని చెప్పారు. అలాగే మున్సిపాలిటీ ఆటోలు ఇండ్ల నుండి సేకరిస్తున్న తడిచెత్త పొడి చెత్తలో కూరగాయల వ్యర్ధాలను వేరుచేసి డంపింగ్ యార్డులో సేంద్రియ ఎరువులు తయారీ చేయిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.