సిరా న్యూస్,చిగురుమామిడి
పాంబండ భూమి అన్యాక్రాంతం పై ధర్మసమాజ్ పార్టీ అభ్యంతరం
* ధర్మసమాజ్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తల్లా నరేష్
* ఆ ప్రభుత్వ భూమిని నిరుపేదలకు పంచాలని తహసీల్దార్‌కు వినతి
చిగురుమామిడి మండలంలో 840 సర్వే లో గల 3-12 మూడు ఎకరాల పన్నెండు గుంటల పాంబండ ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం పై ధర్మ సమాజ్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది.శుక్రవారం తహసిల్దార్ ఇప్ప నరేందర్ కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కావడం చట్ట విరుద్ధమని అన్నారు. అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ భూమిని పరీక్షించాల్సిన బాధ్యత అధికార యంత్రాంగం, ప్రభుత్వంపై ఉందన్నారు.ఆ ప్రభుత్వ భూమిని భూమిలేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలకు కేటాయించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. పేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చేంతవరకు ధర్మ సమాజ్ పార్టీ పోరాటాన్ని కొనసాగిస్తుందని తెలిపారు.మండల యంత్రాంగం నుండి సరైన స్పందన రాకపోతే ఆర్డీవో కలెక్టర్ ఫిర్యాదు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ధర్మసమాజ్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తల్లా నరేష్, మండల ప్రచార కమిటీ సభ్యులు జిల్లెల్ల సురేష్, రమేష్, నవీన్, నాగరాజు, సంతోష్, కొంకట హరీష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.