సిరా న్యూస్, బేల
బేలలో ఘనంగా అహల్యా బాయి హోల్కర్ జయంతి
ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో శుక్రవారం అహల్య బాయ్ హోల్కర్ జయంతి ఉత్సవం నిర్వహించారు. ఈసందర్భంగా పలువురు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు చేశారు. అనంతరం కుల సంఘ అధ్యక్షుడు యశ్వంత్ రావ్ నిపుంగే మాట్లాడుతూ ఆమె చేసిన కృషి గురించి వివరించారు. మహారాణి అహల్యా బాయి హోల్కర్ మరాఠాలు పరిపాలించిన మాల్వ సామ్రాజ్యపు హోల్కర్ వంశ రాణి అని అన్నారు. ఆమె రాజ్యాలకు ఆవల ఉన్న అనేక నిర్మాణాలు , పవిత్ర స్థలాలలో ధర్మశాలలు నిర్మించారన్నారు. ఆమె తన పరిపాలన కాలంలో అందరికీ ధార్మిక కార్యకలాపాలు సతీసహగమనం వంటి సమాజ శ్రేయస్సు కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ విశాల్ గోరే, సంజయ్ నిపుంగే, అమూల్ పోత్లే, దేవన్న ఒలప్ వార్, తదితర సబ్బండ వర్గాల వారు పాల్గొన్నారు.