సిరా న్యూస్,రాజన్న సిరిసిల్ల;
కష్టనష్టాలకోర్చి కొలిమిలో నిప్పులు రాజేసి వ్యవసాయ పనులకు పనికొచ్చే పరిక రాలను తయారు చేసే కమ్మరి వృత్తి నుంచి ఖాకీ కొలువు సాధించిన పోలీసు అధికారి తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న వీడియో ప్రస్తుతం జిల్లాలో వైరల్గా మారింది.
నేర్చుకున్న పని ఎన్ని సంవత్సరాలైన మరవలేము అనే మాట ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ఓ పోలీస్ అధికారిని చూస్తే చెప్పవచ్చు. వృత్తిలో భాగంగా వేములవాడ డీఎస్పీ నాగేంద్రచారి చందుర్తి మండలం మల్యాల గ్రామానికి వచ్చాడు. దాంతో అటు వైవుగా ఓ కమ్మరి ఇనుప పనిముట్లు చేస్తుండగా అతని వద్దకు వెళ్లి సుత్తి, శానం తీసుకొని గొడ్డలిని తయారు చేశాడు. దాంతో చూపరులు అవాక్కయ్యారు. నేటి కుల వృత్తికి డీఎస్పీ నాగేంద్రచారి ఆదర్శమని చెప్పవచ్చు. సుత్తి, శానం పట్టి డీఎస్పీ చేతి వృత్తిని గుర్తు చేసుకొని పనిచేసిన దృశ్యం ప్రస్తుతం సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతోంది.
======================