సిరా న్యూస్,నరసరావుపేట;
పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెం వద్ద తులసి ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. కర్ణాటక నుండి యానాం వెళ్తున్న ట్రావెల్స్ బస్సు లో 39 మంది ప్రయాణికులు వున్నారు. ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. డ్రైవర్ ర్ తో సహా మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా 19 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. మృతి చెందిన మహిళ విజయవాడకు చెందిన దివ్య గా ప్రయాణికులు వెల్లడించారు. మృతురాలు దివ్యతో పాటు బస్సులో ప్రయాణిస్తున్న తన 10 ఏళ్ల కొడుకు వరుణ్ కి స్వల్ప గాయాలుఅయ్యాయి. క్షతగాత్రులను నరసరావుపేట ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారర. రాత్రి నుండి కురుస్తున్న వర్షం దాటికి రోడ్డుపై విరిగిపడ్డ చెట్టు కొమ్మలను తప్పించబోయి ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం…