రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలి

రాయచోటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రాంప్రసాద్ రెడ్డి

సిరా న్యూస్,బద్వేలు;

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని, ఆయన పరిపాలనలో రాష్ట్రం సర్వతముఖాభివృద్ధి చెందాలని రాయచోటి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లె రాంప్రసాద్ రెడ్డి ప్రార్థనలు చేశారు. సోమవారంపాత రాయచోటి శ్రీ హజరత్ జమాలుల్లా బాషా సాహెబ్ దర్గాలో మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.రానున్న రోజుల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా రాయచోటి, రాష్ట్ర ప్రజానీకం సర్వతోముఖాభివృద్ధి చెందాలని మండిపల్లి ఆకాంక్షించారు.,పాత రాయచోటిలో వెలసియున్న శ్రీ హజరత్ జమాలుల్లా బాషా సాహెబ్ దర్గాలో రాయచోటి టిడిపి అభ్యర్థి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి చదివింపులు నిర్వహించి దువా చేశారు. ఈ సందర్భంగా టిడిపి అభ్యర్థి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రేపు జరగబోయే ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా రాయచోటిలో, రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేసి, స్వర్ణాంధ్ర సృష్టికర్త చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని హజరత్ జమాలుల్లా బాషా సాహెబ్ స్వామిని కోరుకున్నానని, అలాగే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సారధ్యంలో ఆ భగవంతుని కృపతో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని మనస్పూర్తిగా ప్రార్థంచానని తెలిపారు. అలాగే తనకోసం వెంట నడిచిన ప్రతి కార్యకర్తకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డితో పాటు మాసాపేట, గిరి, మైనార్టీ సోదరులు ఖాదర్ బాషా, ఎజాస్, ములంటి జాఫర్, ఇర్షాద్, దర్గా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *