సిరాన్యూస్, బోథ్
స్తంభం వేశారు.. కనెక్షన్ మరిచారు..
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని కౌటా (బి) గ్రామంలో ఉన్న ముదిరాజ్ కాలనీలో పాత విద్యుత్ స్తంభం పాడైపోయింది. దాని స్థానంలో కొత్తగా స్తంభం ఏర్పాటు చేయాలని గ్రామస్తులు పలుమార్లు విన్నవించారు. స్పందించిన విద్యుత్ శాఖ అధికారులు చెడిపోయిన పాత విద్యుత్ స్తంభం ప్రక్కన కొత్తగా సిమెంట్ విద్యుత్ స్తంభాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే నూతన స్తంభం పై నుండి విద్యుత్ తీయగలను అమర్చాల్సి ఉందని అధికారులు పట్టించుకోవడంలేదని కాలనీవాసులు వాపోతున్నారు. పాత విద్యుత్ స్తంభం ప్రమాదపు అంచుల్లో ఉండడంతో కొత్తగా స్తంభం వేసిన విద్యుత్ తీగలు అమర్చకపోవడంతో వర్షాకాలం ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందని కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు ఈ విషయంలో తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.