సిరా న్యూస్,హైదరాబాద్;
హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కీలక ఆదేశా జారీ చేసారు.మంగళవారం జరిగే లోక్సభ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగేలా పూర్తి భద్రతను ఏర్పాటు చేశామని వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు సా.6 గంటల నుంచి ఎల్లుండి ఉ.6 గంటల వరకు 144 సెక్షన్ అమలు చేయాలని, మద్యం దుకాణాలు బంద్ చేయాలన్నారు. కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగేలా నాయకులు సహకరించాలని కోరారు.
=====================