అత్యధికం… అత్యల్పం… తెలుసా

సిరా న్యూస్,ముంబై;
ఎన్నికల్లో గెలవడం అంటే ఓ కిక్కు. అభ్యర్థులు ఒక్కోసారి అఖండ మెజారిటీతో గెలుస్తారు. కొందరేమో స్వల్ప తేడాతో ఓడిపోతారు. లోక్‌సభ ఎన్నికల చరిత్రలో ఇప్పటి వరకు ఇద్దరు నేతలు మాత్రమే సింగిల్ డిజిట్ తేడాతో గెలుపొందారు. ఇదిలా ఉంటే మరో అభ్యర్థి ఏకంగా 98 శాతం ఓట్లతో విజయం సాధించారు. ఇప్పటి వరకు ఉన్న లోక్‌సభ ఎన్నికల అత్యధిక, అత్యల్ప మెజారిటీ రికార్డు గురించి మీకు తెలుసా?బీజేపీ నాయకురాలు ప్రీతమ్ ముండే లోక్‌సభ ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు. 2014లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆమె అరుదైన ఘనత సాధించారు. మహారాష్ట్ర బీద్ ఎంపీ రోడ్డు ప్రమాదంలో మరణించగా ఆ స్థానంలో ఉపఎన్నిక నిర్వహించారు. దీంతో అక్కడ ఆయన కుమార్తె ప్రీతమ్ పోటీ చేయగా రికార్డు స్థాయిలో 6.96 లక్షల ఓట్ల మెజారిటీతో ఆమె గెలుపొందారు.2019 సార్వత్రిక ఎన్నికల్లో నలుగురు అభ్యర్థులు 6లక్షలకు పైగా మెజారిటీ సాధించారు. కానీ ఎవరు ప్రీతమ్ రికార్డును చేరుకోలేదు. అయితే ఈ అభ్యర్థులంతా బీజేపీ నేతలే కావడం విశేషం. గుజరాత్‌లోని నవపరిలో బీజేపీ నేత సీఆర్ పాటిల్ 6.89 లక్షల మెజారిటీతో గెలుపొందారు.హర్యానాలోని కర్నాల్‌లో సంజయ్ భాటియా 6.56 లక్షలు, ఫరీదాబాద్ లో కృష్ణపాల్ గుజ్జర్ 6.38 లక్షలు , రాజస్థాన్ భిల్వాడాలో సుభాష్ బహేరియా 6.12 లక్షలు, 2004 ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లోని ఆరంభాఘ్‌లో సీపీఎం నేత అనిల్ బసు 5.92 లక్షల మెజారిటీతో గెలుపొందారు.భారీ మెజారిటీ సాధిస్తే గెలుపు ఏకపక్షం అవుతుంది. కానీ కొన్నిసార్లు అభ్యర్థులు స్వల్ప మెజారిటీతో విజయం సాధిస్తారు. అలా ఇద్దరు ఎంపీలు ఇప్పటి వరకు 9 ఓట్ల తేడాతో గెలుపొందారు. 1989 లోక్ సభ ఎన్నికల్లో ఉమ్మడి ఏపీలో అనకాపల్లి కాంగ్రెస్ అభ్యర్థి కొణతల రామకృష్ణ 9 ఓట్ల తేడాతో గెలుపొందారు. 1998లో బీహార్ రాజ్‌మహల్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి సోమ్ మరండి 9 ఓట్ల తేడాతో గెలుపొందారు.
====================XXXX

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *