సిరా న్యూస్,వికారాబాద్;
తాండూర్ పట్టణంలోని నడి రోడ్డు లో అతి వేగం తో అదుపు తప్పి కారు బోల్తా పడింది. నేషనల్ హైవే 167 రోడ్డు నిర్మాణ కాలువలో కారు దూసుకెళ్లింది. ఆ సమయంలో నలుగురు యువకులు కారులో ప్రయాణిస్తున్నారు. వారిని తాండూర్ పట్టణం దుబాయ్ రెడీ మెడ్ షాప్ కి చెందిన సర్దార్,సల్మాన్, జుబేర్, హైమద్ వ్యక్తులు గా పోలీసులు గుర్తించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమం గా వుండడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు.