సిరాన్యూస్, ఆదిలాబాద్
సీఆర్పీఎఫ్ సిబ్బంది విధులు అభినందనీయం: అదనపు ఎస్పీ బి సురేందర్ రావు
* సీఆర్పీఎఫ్ సిబ్బందికి ఘనంగా వీడ్కోలు
* సిబ్బందిని సత్కరించిన అధికారులు.. బహుమతులు అందజేత
సీఆర్పీఎఫ్ సిబ్బంది విధులు అభినందనీయమని ఆదిలాబాద్ జిల్లా అదనపు ఎస్పీ బి సురేందర్ రావు అన్నారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో వైటీసీ కేంద్రంలో సీఆర్పీఎఫ్ సిబ్బందికి వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్ అదనపు ఎస్పీ బి సురేందర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం సీఆర్పీఎఫ్ సిబ్బందిని పూలమాల శాలువాలతో సత్కరించారు. బహుమతులు ప్రదానం చేసి సాధారణంగా సాగనంపారు. జిల్లా పోలీసుల తరఫున ఎల్లవేళలా ఎటువంటి అవసరం వచ్చిన సహాయాలు అందిస్తామని తెలియజేశారు. అదేవిధంగా వీరు చేసిన సేవలను ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పి పోతారం శ్రీనివాస్ కొనియాడారు. సిఆర్పిఎఫ్ సిబ్బంది తమ సర్వీసు మొత్తంలో ఆదిలాబాద్ జిల్లాలో పోలీసులు అందించిన సేవలను మరిచిపోలేమని తెలిపారు. కార్యక్రమంలో డిఎస్పీ లు ఎల్ జీవన్ రెడ్డి, పోతారం శ్రీనివాస్, సీఐలు కే సత్యనారాయణ, ఏ అశోక్, కె ఫణి ధర్, మావల ఎస్ఐ విష్ణువర్ధన్, సిఆర్పిఎఫ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.