సిరాన్యూస్, ఆదిలాబాద్
మొక్కల సంరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యలు కావాలి : మాజీమంత్రి జోగు రామన్న
* పార్టీలకు అతీతంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని కొనసాగించాలి
మొక్కల సంరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యలు కావాలని, బాధ్యత వ్యవహరిస్తూ ప్రతి ఒక్కరు ఐదు మొక్కలు నాటేందుకు కృషి చేయాలని మాజీ మంత్రి జోగు రామన్న పిలుపునిచ్చారు. బుధవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం లో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రివర్యులు జోగు రామన్న పార్టీ శ్రేణులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం మొక్కలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్బంగా జోగు రామన్న మాట్లాడుతూ మొక్కల పెంపకం కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని ,పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. మొక్కల సంరక్షతోనే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్నారు. అలాగే అశోకుడు చెట్లు నాటించెను అనే స్ఫూర్తి నేడు మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ సారాధ్యంలోనే మళ్లీ అంతటి కీర్తిని సాధించామన్నారు. హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసి మొక్కల ఎదుగుదలకు విశేషంగా కృషి చేశారన్నారు.కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ఆక్సిజన్ ప్రాముఖ్యత ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. మానవుడి మనుగడ రైతు సంక్షేమం ప్రతిదీ మొక్కలపై ఆధారపడి ఉంటుందని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటేందుకు ముందుకు రావాలని సూచించారు. కార్యక్రమంలో బిజ్జగిరి నారాయణ, మాజీ మార్కెట్ చైర్మన్ కొమ్రా రాజు, సేవ్వా జగదీష్, డైరెక్టర్ మెస్రం పరమేశ్వర్, అర్చన రామ్ కుమార్, గడ్డం లక్ష్మణ్, నవాతే శ్రీనివాస్, మోరియా సురేందర్, గెడ్డం రాజు, రాజేష్, రఘు, తదితరులు పాల్గొన్నారు.